పలమనేరు: జలపాతం లో గల్లంతైన యూనిస్ ఆచూకీకై 10 మంది గజ ఈతగాళ్లు,యువతకు ముఖ్య సూచనలు చేసిన పోలీస్ & అగ్నిమాపక అధికారులు
పలమనేరు: పట్టణ సీఐ మురళీమోహన్ అగ్నిమాపక అధికారి మనోగరణ్ తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు పట్టణానికి చెందిన యూనిస్ కల్యాణ రేవు జలపాతంలో గల్లంతయ్యారు. అతని కోసం తమిళనాడు నుండి 10 మంది గజ ఈతగాలను అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది అందరూ కలిసి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రాంతం వరకు కూడా యూనిస్ ఆచూకీ లభ్యం కాలేదు. మరింత ప్రయత్నం చేయబోతున్నాము కచ్చితంగా నేడు కనుగొంటామన్నారు. ముఖ్యంగా పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉంది దయచేసి యువత అందులో దిగి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దన్నారు.