కర్నూలు: కర్నూలు లోని కీర్తి స్కూలుపై కఠిన చర్యలు తీసుకుంటాం: కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామలపాల్
విద్యార్థి మృతికి కారణమైన కీర్తి స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ శామ్యూల్ పాల్ అన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు నగరంలోని అధికారులతో కలిసి ఘటనా స్థలానికి డీఈఓ చేరుకొని పరిశీలించారు. అక్కడ నుంచి మృతి చెందిన విద్యార్థి ఇంటికి చేరుకొని తల్లిదండ్రులను పరామర్శించారు. కలెక్టర్ ఎ.సిరి విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమె అన్నారు.