ఉరవకొండ: బ్రాహ్మణపల్లి వద్ద విద్యుత్ తీగల తగిలి ట్రాక్టర్ లోని పశుగ్రాసానికి మంటలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం రైతు కృష్ణ స్వామి ట్రాక్టర్ లో మొక్కజొన్న పశుగ్రాసాన్ని తీసుకువస్తుండగా గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు తగిలి పశుగ్రాసానికి మంటలు చెలరేగాయి. మంటలను గ్రహించిన సమీప రైతులు ట్రాక్టర్ డ్రైవర్ కు తెలియజేసి అప్రమత్తం చేశారు. మంటలు కాస్త మొక్కజొన్న పశుగ్రాసానికి మొత్తం వ్యాప్తి చెందాయి. వెను వెంటనే ట్రాక్టర్ లోని పశుగ్రాసాన్ని మొత్తం రహదారిపైనే లిఫ్ట్ చేసారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. మంటలతోనే గ్రామంలోకి ట్రాక్టర్ వెళ్లి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని గ్రామస్తులు వాపోయారు.