ఒంగోలు అర్బన్: ముళ్ల పొదల్లో మృతి చెందిన మగ శిశువు. కేసు నమోదు చేసి విచారిస్తున్న తాలూకా పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 18, 2026
ఒంగోలు పట్టణంలోని గాంధీ రోడ్ లోని ఓ పి ఎస్ స్కూల్ ఎదురుగా శివారు ప్రాంతంలో ముళ్ళపదల్లో మృతి చెందిన సుమారు ఏడు రోజులు మగ శిశువును పారేయడం జరిగినది స్థానికులు ఆ శిశువును గమనించి వెంటనే హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాగర్ కు సమాచారం ఇవ్వగా వెంటనే విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన దినేష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నాగమణి సూచన మేరకు అంగన్వాడీ కార్యకర్త ద్వారా తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తుని చేపట్టారు