బనగానపల్లె: మంత్రాలయం వద్ద రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి, దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన 8 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. బొలెరో వాహనం రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.