నంద్యాల అర్బన్: నంద్యాల మండలంలో మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం
Nandyal Urban, Nandyal | May 2, 2026
నంద్యాల మండలం అయ్యలూరులో పొదుపు మహిళలకు శక్తి టీం సభ్యులు చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాకే పెళ్లి చేయాలని వారు స్పష్టం చేశారు. ఏదైనా ఆపద ఎదురైతే వన్ స్టాప్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని మహిళలకు అవగాహన కల్పించారు.