అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని అంకంపల్లి, దుద్దేకుంట గ్రామంల్లోని అరటి తోటల్లో ఫ్రూట్ కేర్ ఆక్టివిటీ పై ఉద్యాన అధికారి కృష్ణ తేజ రైతులకు అవగాహన కల్పించారు. మంగళవారం తోటలను సందర్శించి రైతులతో సాగు వివరాలు సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా రైతులకు బననా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ప్లాంట్ ప్రొటెక్షన్ మెసెర్స్ పైన, సిగటోక ఆకుమచ్చ తెగులు పై రైతులకు సూచనలు ఇచ్చారు. పసుపు మచ్చ రంగుకు మారి ఆకులు ఎండిపోతాయని మ్యాంకోజబ్ 1గ్రా / లీ నీట మినరల్ ఆయిల్ పిచికారి చేయవలసింది రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు.