ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు
ఆళ్లగడ్డలో పట్టణ సీఐ చిరంజీవి స్పెషల్ పార్టీ సిబ్బందితో మంగళవారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో ప్రజాశాంతికి భంగం కలగకుండా పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సీఐ చిరంజీవి ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.