అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఉప్పరపల్లి ఆర్డిటి క్రీడా మైదానంలో శనివారం నాలుగున్నర గంటల సమయంలో అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి అనంతపురం జిల్లా నూతన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా ఆర్డిటి డైరెక్టర్ మంచు ఫెర్రర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనాథ్ ఉపాధ్యక్షుడిగా నూర్ మహమ్మద్ ఖాన్ కార్యదర్శిగా గంగాధర్ రెడ్డి జాయింట్ సెక్రటరీగా సర్దార్ ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగిందని ఆర్డిటి డైరెక్టర్ మంచు ఫెర్రర్ పేర్కొన్నారు.