కన్నెమడుగులో పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు
అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె నియోజకవర్గం కన్నెమడుగు గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రభుత్వ పశువైద్యాధికారి విక్రం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి ఆవులకు. దూడలకు గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో రైతుల ఇంటి వద్దకే వచ్చి పశువులకు వ్యాక్సిన్లు పిచికారి చేయడం జరుగుతుందన్నారు . ఈ కార్యక్రమంలో రైతులు సిబ్బంది పాల్గొన్నారు.