కర్నూలు: కర్నూలు నగరంలోని ఏ, బి, సి క్యాంపుల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి: రాష్ట్ర మంత్రి టిజి భరత్
కర్నూలు నగరం లోని ఏ, బి,సి క్యాంపుల్లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కు భూమి గుర్తింపు అంశంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మంత్రి టీజీ భరత్ సమావేశం నిర్వహించారు.