డోన్: బేతంచెర్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి
Dhone, Nandyal | Apr 14, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గోర్లగుట్ట గ్రామ సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బనగానపల్లె మండలం ఎనకండ్ల గ్రామానికి చెందిన సుజాత (38) తన కొడుకుతో కలిసి బైకుపై వస్తుండగా ప్రమాదవశాత్తు పై నుంచి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతచెందినట్లు ఏఎస్ఐ నబి తెలిపారు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.