కనిగిరి: లింగన్నపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలికాప్టర్ మరియు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
పెదచెర్లపల్లి మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు మంగళవారం ఎం ఎస్ ఎం ఈ పార్కును ప్రారంభించేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రతా విభాగం, ప్రకాశం జిల్లా వి హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్, ఆయన కాన్వాయ్ కు విజయవంతంగా సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో లింగన్నపాలెంలో భారీ భద్రత చర్యలను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టారు.