చిన్నగూడూరు: కొనుగోలు కేంద్రాలలో కాంటాలు పెంచాలి, ఉగ్గంపల్లిలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతు కూలీ సంఘం డిమాండ్
కొనుగోలు కేంద్రాల్లో ఒకటి రెండు కాంటాలు ఉండడంతో దాన్యం కాంటాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెంచాలని తేమ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ధాన్యం కాంటాలువేయాలని ,సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ తరుణ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ఉడుగుల లింగన్న, అఖిల భారత రైతు కొలి సంఘం డివిజన్ కార్యదర్శి ఇరుగు నాగన్నలు డిమాండ్ చేశారు. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.