ఒంగోలు అర్బన్: లాకప్ డెత్తులపై మీడియాతో మాట్లాడిన దళిత పరిరక్షణ నేత నీలం నాగేంద్రం, సాయి కృష్ణ మిస్సింగ్ పై ఆగ్రహం
Ongole Urban, Prakasam | Jun 20, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో దళిత పరిరక్షణ నేత నీలం నాగేంద్ర సాయి కృష్ణ మిస్సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన లాకప్ డెత్ లపై ఆయన మాట్లాడారు. కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ మిస్సింగ్ పై పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సీఐ నాగరాజే సాయి కృష్ణను హత్య చేసి కాల్చి వేసి ఉంటాడని ఆరోపించారు. ఎన్ని పోరాటాలు చేసిన పోలీసుల తిరులో మార్పు రావడంలేదని నాగేంద్రం అసహనం వ్యక్తం చేశారు.