తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం సౌమన్యా టైల్స్ ఫ్యాక్టరీలో మృతి చెందిన వారికి కోటి రూపాయలు, క్షతగాత్రులకు 25 లక్షలుచొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి చేమూరు గురవయ్య తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి చంగయ్య మాట్లాడుతూ... శ్రీకాళహస్తి రూరల్ మండలం మన్నవరం వద్ద ఏల్లంపాడు సమీపంలో ఉన్న టైల్స్ పరిశ్రమలో బుధవారం గ్యాస్ ట్యాంకర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగిన సంఘటనలో ఇద్దరు కార్మికులు మరణించగా, ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారి కుటుం