సింగరాయకొండ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా రవిశంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నిక కార్యక్రమంలో టిడిపి బలపరిచిన రవిశంకర్ రెడ్డికి ఉపసర్పంచ్ పదవి దక్కింది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ ఉపసర్పంచ్ పదవి దక్కించుకోవడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామికి రవిశంకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రవిశంకర్ రెడ్డి తెలిపారు.