కర్నూలు: మహిళల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి : ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల
మహిళల హక్కుల సాధనకై, సమస్యల పరిష్కారానికై మహిళలందరూ ఐక్యంగా కదలికలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. నిర్మల పిలుపునిచ్చారు.జీబీ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మూడవ నగర మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి రషీదా అధ్యక్షత వహించగా, సీనియర్ నాయకురాలు ఖమ్రుబీ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ… మహిళలు కేవలం వంటగది వరకే పరిమితం కాదని, నటిగా, డాక్టర్‌గా, కలెక్టర్‌గా, పైలట్‌గా ఇలా ప్రతి రంగంలోనూ ప్రాధాన్యత సంతరించుకున్నారని గుర్తుచేశారు. సమాజంలో సగభాగం మహిళలే ఉన్నా, వారి పట్ల కేంద్ర–రా