స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి : CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజయ్ కుమార్...
స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి కె. అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం లింగసముద్రం అంబేడ్కర్ నగర్లో జరిగిన సీఐటీయూ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, మిడ్డే మీల్స్ వర్కర్ల జీతాలను పెంచడంలేదని, ప్రభుత్వం కార్మికులను వెట్టి చాకిరి చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలను వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.