కడప: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలి: DYFI జిల్లా కార్యదర్శి శివ కుమార్
Kadapa, YSR | Sep 26, 2025 దసరా పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ప్రజల వద్ద నుండి అధిక టికెట్ రేట్లు పెంచి వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ తెలిపారు.శుక్రవారం నాడు జిల్లా రవాణా శాఖ కార్యాలయం నందు కార్యాలయ పరిపాలన అధికారి ప్రకాష్ గారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ జిల్లా లోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు సాధారణ రోజులలో ఒక ధర,పండుగ సీజన్ లలో ఒక ధరను పెట్టడం వల్ల సామాన్య ప్రజలను పీడిస్తున్నారని అన్నారు.