జహీరాబాద్: సజ్జ రావు పేట తండా, దిడిగి గ్రామాల్లో పేకాట శిబిరాలపై పోలీసుల దాడి, 1.20 వేల నగదు స్వాధీనం, 15 మందిపై కేసు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సజ్జ రావు పేట తండా, దిడిగి గ్రామాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ ఆధ్వర్యంలో రెండు గ్రామాల్లో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 15 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,21,250, రూపాయల నగదు, 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట జూదం ఆడిన నిర్వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.