డోన్: మానవత్వం చాటుకున్న డోన్ ద్రోణాచలం సేవాసమితి
Dhone, Nandyal | Apr 24, 2026 నంద్యాల జిల్లా డోన్ వైయస్ నగర్కు చెందిన బోయ సుంకమ్మ (70) అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులెవరూ ముందుకు రాని స్థితిలో ద్రోణాచలం సేవాసమితి మానవత్వం చాటుకుంది. స్థానికుల కోరిక మేరకు సేవా సైనికులు ఆమె మృతదేహానికి హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సమితి తరఫున ఇది 134వ అంత్యక్రియ కావడం విశేషం. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న సభ్యులను పట్టణ ప్రజలు అభినందించారు.