గూడూరు బాలాజీ లెమన్ మార్కెట్ వద్ద వెంకటగిరి రోడ్డుపై సోమవారం ట్రాఫిక్ జామైంది. ఇరువైపులా కిలోమీటర మేర వాహనాలు నిలిచిపోయాయి. నెల్లటూరు సమీపంలోని పంచర్ షాపు వద్ద లారీ రివర్స్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మరొక పెద్ద లారీతో అడ్డంగా నిలిచిన లారీని తొలగించారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.