నంద్యాల జిల్లా ఆత్మకూరులో శుక్రవారం జరిగిన కుక్కల దాడిలో 3 ఏళ్ల ఆర్సియ తీవ్రంగా గాయపడింది. దీంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఢిల్లీ నుంచి వీడియో కాల్ ద్వారా ఆర్సియా తల్లితో మాట్లాడి, పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి పాపకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.