మహానంది మండలం గాజులపల్లె సమీపంలో, అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా,ఒకరు మృతి,
మహానంది మండలం గాజులపల్లి సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో ఐదు మందికి స్వల్ప గాయాలు కాగ ఒకరు మృతి చెందారు,అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది, వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, గాజుల పల్లకి చెందిన వీరంతా శనివారం మధ్యాహ్నం అరటి గెలలు కోయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది,ఈ ఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,