ఒంగోలు అర్బన్: ఇండోసోల్ పరిశ్రమకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 10, 2026
ఇండోసోల్ పరిశ్రమకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పురోగతిపై శుక్రవారం ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. భూములు ఇచ్చేందుకు తొలుత సుముఖత వ్యక్తం చేసి, ప్రస్తుతం ముందుకు రాకపోవడానికి కారణాలపై కలెక్టర్ ఆరా తీశారు. పరిహారం చెల్లింపులో జాప్యానికి కారణాలపైనా చర్చించారు. కాగా, సంబంధిత అంశాలను, ఇప్పటివరకు సేకరించిన భూమి, పెండింగ్ వివరాలను అధికారులు ఆయనకు వివరించారు.