డోన్: కర్ణాటక గుజరాత్లలో పశువైద్యుల మృతికి నిరసనగా డోన్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిరసన
Dhone, Nandyal | Apr 6, 2026 కర్ణాటక, గుజరాత్లలో పశువైద్యుల మృతికి నిరసనగా డోన్ పట్టణంలో పశుసంవర్ధక శాఖ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పశు వైద్యశాల నుంచి గాంధీ సర్కిల్ వరకు ఈ నిరసన సాగింది. ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన వైద్యుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.