వికారాబాద్: 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి: జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యనాయక్
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఓటరు ముసాయిదా తుది జాబితా పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ ముసాయిదాను విడుదల చేశారు.