నంద్యాల అర్బన్: నంద్యాలలో టిడిపి కార్యాలయానికి ఎకరాకు సంవత్సరానికి రూ. 1000చొప్పున 2ఎకరాలు కేటాయించు కేటాయింపు : మాజీ ఎమ్మెల్యే శిల్ప
Nandyal Urban, Nandyal | Apr 3, 2026
నంద్యాల నడిబొడ్డులో టిడిపి కార్యాలయానికి ఎకరాకు సంవత్సరానికి ₹1000 చొప్పున రెండు ఎకరాలు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గవర్నమెంట్ విలువ ప్రకారం 15 కోట్ల విలువ చేసే భూమిని 33 సంవత్సరాలకు 66000 రూపాయలకు కేటాయించడం దారుణం అన్నారు. శిల్పా సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షాపులకు నెలకు మార్కెట్ యార్డ్ కు సుమారు 80000 రూపాయల రెంటు కడుతున్నట్లు వారు గుర్తు చేశారు.