నందికోట్కూరు: 10 బొల్లవరం గ్రామంలో వ్యవసాయ బోర్లు వైర్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ పోలీసులకు ఫిర్యాదు
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామంలో గత కొద్ది రోజులుగా వ్యవసాయ బోరు వైర్లను, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ను , గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది.వ్యవసాయ పొలాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ చాలా తీవ్రమైన సమస్యగా మారింది, ఇక్కడ దొంగలు ప్రధానంగా వాటిని ధ్వంసం చేసి లోపల ఉండే విలువైన కాపర్ (రాగి) వైర్లు, అల్యూమినియం కాయిల్స్ మరియు ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ను దొంగిలిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ శాఖకు లక్షల రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా, రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆదివారం రైతులు ఆవేదన చెందారు,