నందికొట్కూరు పట్టణంలో: ఉరుములు మెరుపులతో ఓ మోస్తారు వర్షం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో ఓ మోస్తారు వర్షం కురిసింది, అల్పపీడన ప్రభావంతో మోస్తారు వర్షం కురవడంతో పట్టణంలోని వీధుల్లో వర్షపు నీరు నిలిచి వీధులు చిత్తడిగా మారాయి, వరి కంది పంట సాగుచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేయగా, మొక్కజొన్న మినుము ఉల్లి సాగు చేసి పంట కోతకు రావడంతో ఆరబోసుకున్న పంట తడిచే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.