మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం:జిల్లా రెవిన్యూ అధికారి కె. మధుసూదనరావు
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 138వ జయంతోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత తొలి విద్యాశాఖ మంత్రి, మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి (డి.ఆర్.ఓ) కె. మధుసూదనరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి డి.ఆర్.ఓ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ..మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం అని వారు వేసిన