బనగానపల్లె బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం 'జనతా వారధి' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ తెలిపారు. అధిష్ఠానం పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సూచనలతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.