చందుర్తి: అంబులెన్స్ లో ప్రసవం..108 పైలెట్ సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన గర్భిణీ టీ.శిరీషకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కి సమాచారం ఇచ్చారు. ఆమెను వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్ ఈఎంటీ మాలవత్ గణేష్, పైలెట్ పతంగి మహేష్, కుటుంబసభ్యుల సహకారంతో అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం చేయించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.ఏరియా ఆసుపత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో తల్లి బిడ్డ ఉన్నారు.