రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఒక ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఒక ఇంట్లో మహిళ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగి మాధవి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడే ప్రయత్నంలో కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.