పోలేపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షికి జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో మహిళలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో శనివారం 12 గంటల పది నిమిషాల సమయంలో వాల్మీకి కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ వాల్మీకి కులస్తుల ఆహ్వానం మేరకు వాల్మీకి మహర్షి జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందని, అదేవిధంగా రానున్న రోజుల్లో వాల్మీకుల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ అందజేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి కులస్తులందరూ పాల్గొన్నారు.