పన్ను చెల్లించని పశ్చిమ బెంగాల్ వాహనానికి జరిమానా విధించిన డోన్ MVI క్రాంతికుమార్
Dhone, Nandyal | May 20, 2026 నంద్యాల జిల్లా డోన్ ఆర్టీవో కార్యాలయం సమీపంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారి క్రాంతి కుమార్ బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టెంపో ట్రావెలర్ వాహనం ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా కర్ణాటక వైపు వెళ్తుండగా పట్టుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేసి రూ.77 వేల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. రోడ్డు నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.