బనగానపల్లె: బక్రీద్ పండగ సందర్భంగా బనగానపల్లెలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు
బనగానపల్లెలోని ఈద్గా ప్రాంగణంలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ప్రభుత్వ ఖాజీ సయ్యద్ అబ్దాల్ సాహెబ్ మాట్లాడుతూ.. త్యాగం, ప్రేమ, సోదర భావానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు