ఒంగోలు అర్బన్: ఒంగోలు మంగమూరు రోడ్లో భారీ చోరీ. బాధితుడి ఆవేదన
Ongole Urban, Prakasam | Jul 5, 2026
ఒంగోలు నగరంలో భారీ చోరీజరిగింది. మంగమూరు డొంక ఆశ్రమం వెనుక నివాసం ఉంటున్న చంద్రమౌళి.. గత నెల 30న కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. శనివారం రాత్రి తిరిగి వచ్చి చూడగా.. తలుపులు విరిగి ఉన్నాయి. కంగారు పడిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా.. ఇంట్లో దాచిన అరకిలో పైగా బంగారం, 8 కిలోలు వెండి వస్తువులు, 50 కిలోలు రాగి బిస్కెట్లు మాయమయ్యాయి. రూ. 7 లక్షల నగదు కూడా చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమౌళి కుమారుడు శ్రీనాథ్ గాంధీ రోడ్డులోని ఓ నగల దుకాణంలో పని చేస్తుంటాడు. తాము విహారయాత్రకు పోయి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు