చీమకుర్తి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీడీవో రాఘవేంద్ర ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సంతనూతలపాడు ఎమ్మెల్యే BN విజయ్ కుమార్ గ్రామాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... చీమకుర్తి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండలంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించి గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.