ఆళ్లగడ్డ: వేసవికాలంలో గర్భిణీలు వృద్ధులు పిల్లలు అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ నరసింహ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వేసవికాలంలో గర్భిణీలు వృద్ధులు చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఆళ్లగడ్డ యూపిహెసీ వైద్యుడు డాక్టర్ నరసింహ సూచించారు, గురువారం ఆళ్లగడ్డలో మీడియాతో మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు ద్రవపదార్థాలు తీసుకోవాలని తెలిపారు, తేలికపాటి ఆహారం తీసుకోవడంతో పాటు శరీరం చల్లగా ఉంచుకోవాలని చెప్పారు, ఎండ దెబ్బ నుంచి రక్షణకు తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.