కావలి: వాగులో గల్లంతైన వ్యక్తి శవం వెలికితీత..జలదంకి మండలంలో ఘటన
వాగులో గల్లంతైన వ్యక్తి శవం వెలికితీత జలదంకి మండలం ఛామదల వద్ద నేరెళ్ల వాగులో గల్లంతైన దంపూరు మల్లికార్జున (45) మృతదేహం వెలికితీశారు. చామదలకు చెందిన మల్లికార్జున కావలికి వెళ్లేందుకు బైక్‌పై వాగు దాటుతుండగా వాగులో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. జలదంకి తహశీల్దార్ ప్రమీల, జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా రెస్క్యూ టీమ్‌ను రప్పించి వెలికి తీశారు.