కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాచవరంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమాన్ని కనిగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం మొదలు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై వైసీపీ చేసే పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.