ఒంగోలు అర్బన్: ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే మీకోసం కార్యక్రమం ఉదయం 11 గంటల వరకే నిర్వహణ: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 17, 2026
ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే మీకోసం కార్యక్రమం మే 18వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల వరకే నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం తెలిపారు. వేసవి కాలం నేపథ్యం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమయం మార్పులను ప్రజలు గుర్తించి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ప్రజలు తమ అర్జీలను అందించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి చేశారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని ఎస్పీ అన్నారు.