కనిగిరి: పెదచెర్లోపల్లి ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు
పెదచెర్లోపల్లి ప్రభుత్వ వైద్యశాలను కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకంలో భాగంగా కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ అజయ్ మిశ్రా, డాక్టర్ వర్ష ,డాక్టర్ భార్గవి, డాక్టర్ చరిత ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం వైద్యశాలలో ఏ విధంగా అమలవుతుందో వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు రోగులను కలిసి , వైద్యశాలలో అందుతున్న సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ... ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ పథకం పెద్ద చెర్లోపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఏవిధంగా అమలవుతుందో పరిశీలించేందుకు వచ్చామన్నారు.