ఆత్మకూరు మండలం గొర్రెదిండ్ల తండాలో శుక్రవారం నాలుగు గంటల 10 నిమిషాల సమయంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బండారు శివ ఆధ్వర్యంలో సిపిఐ శాఖ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అందులో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చట్టాన్ని రద్దు చేసి ఒక కొత్త బిల్లును ప్రవేశపెడుతుందని వీటికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో 22న నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొనాలని సిపిఐ రమేష్ పిలుపునిచ్చారు.