నంద్యాల అర్బన్: నంద్యాలలో లైన్స్ క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ పర్యటన
Nandyal Urban, Nandyal | May 17, 2026
నంద్యాలలో లయన్స్ క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ ఆదివారం పర్యటించారు. దివ్యాంగులకు నెలవారి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పేదలకు కుట్టుమిషన్లు, వీల్ చైర్లు, సంక కర్రలు, వినికిడి యంత్రాలు, నిత్యావసర సరుకులు అందించారు. నంద్యాల లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను గవర్నర్ గోపాలకృష్ణ అభినందించారు. క్లబ్ సీనియర్ సభ్యులు ఆంజనేయులు గుప్తా, డా. సహదేవుడు, డా.రవికృష్ణ పాల్గొన్నారు.