ఆళ్లగడ్డ: చాగలమర్రి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ డ్రైవర్ మృతి
నంద్యాల జిల్లా చాగలమర్రి వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు, తమిళనాడు నుంచి జమ్మూ కాశ్మీర్ కి వెళ్తున్న లారీని రోడ్డు పక్కకు నిలిపి ఉండగా గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ను ఢీ కొట్టినట్లు సమాచారం ఘటనా స్థలంలోనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు