SH. ఎర్రగుడిలో అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి
Dhone, Nandyal | May 2, 2025 ఎర్రగుడి గ్రామానికి చెందిన రైతు రమేష్(35) అప్పుల బాధ భరించలేక గత నెల 29న పురుగు మందు తాగి, కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. రైతు రమేష్ గ్రామంలో తన రెండు ఎకరాలు, మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సరిగా పండక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తోచక మనస్థాపంతో పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు కర్నూలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు క్రిష్ణగిరి పోలీసులు తెలిపారు.