రాయచోటి: రాబోయే ఆరు నెలల్లో రింగ్ రోడ్డు నాలుగు వరసల అభివృద్ధి, ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.బుధవారం రాయచోటిలో రింగ్ రోడ్డు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా రూ.7.5 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.పనుల నాణ్యతపై రాజీ ఉండదు. రాయచోటి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన పేర్కొన్నారు.